: 'సూటు-బూటు' ప్రజల కోసమే బుల్లెట్ ట్రైన్లు: రాహుల్ గాంధీ మండిపాటు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెట్టాలన్న బీజేపీ సర్కారు ప్రతిపాదన పేదలు, రైతుల కోసం కాదని, కేవలం సూటు-బూటు ప్రజలకు మేలు చేసేందుకు ఉద్దేశించినదని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ లో ఓ సభలో మాట్లాడుతూ... మోదీ సర్కారు పేదల గురించి ఆందోళన చెందడం లేదని, సంపన్నుల గురించే ఆలోచిస్తోందని అన్నారు. పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారని, అదే సమయంలో పేదలు, రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకు ఉద్దేశించినవని అన్నారు.

  • Loading...

More Telugu News