: నిజానిజాలు వెలికితీస్తే చివరికి దొరికేది కేసీఆరే: పయ్యావుల


సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. సర్కారుపై నిఘా పెట్టడం భయంకరమైన నేరం అని అన్నారు. తీవ్రవాదులపైనా, సంఘ విద్రోహ శక్తులపైనా నిఘా పెడతారని, అలాంటిది ప్రభుత్వంపైనా, ప్రభుత్వాధినేతలపైనా, అధికారులపైనా నిఘా వేయడమంటే భారత్ లో భయంకరమైన నేరం అని పేర్కొన్నారు. నిఘా ఎలాంటి సందర్భాల్లో వేయాలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పయ్యావుల వివరించారు. తీవ్రవాదుల నుంచి కాపాడుకునే సందర్భాల్లోనే నిఘా పెట్టాలని సుప్రీం పేర్కొందని, అయితే, కేసీఆర్ ప్రజాప్రతినిధులపైనే నిఘా పెట్టడం ద్వారా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని దుయ్యబట్టారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించాల్సిన నిఘా పరికరాలను నేతలపై ప్రయోగించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేశామని చెప్పాలని, చేయకపోతే చేయలేదని చెప్పాలని, అంతేగానీ, దాటవేసే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. వీటన్నంటిలో నిజానిజాలు వెలికితీస్తే చివరికి దొరికేది కేసీఆరేనని అన్నారు.

  • Loading...

More Telugu News