: వ్యాయామం ఎక్కువైతే ప్రమాదకరం అంటున్న ఆస్ట్రేలియా పరిశోధకులు
వ్యాయామం ఆరోగ్యదాయకమని తెలిసిందే. కానీ, అతి సర్వత్ర వర్జయేత్ అంటుంటారు పెద్దలు. ఈ క్రమంలో, అధిక వ్యాయామం కూడా ప్రమాదకరమేనంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల ప్రేగుల నుంచి విడుదలయ్యే హానికర బ్యాక్టీరియా రక్తంలో కలుస్తుందని, ఇది ప్రమాదకరమని వారు తెలిపారు. ఈ బ్యాక్టీరియా అధికమొత్తంలో రక్తంలో కలవడం వల్ల వ్యాధినిరోధక శక్తికి ప్రతిబంధకాలు ఏర్పడతాయని వివరించారు. పూర్తి ఆరోగ్యవంతులపై పరిశోధనలు జరిపి ఈ వివరాలు తెలిపారు.