: అశోక్ గజపతి రాజు సీఎం అవుతారని దుష్ప్రచారం జరుగుతోంది: మంత్రులతో చంద్రబాబు
ఓటుకు నోటు కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించడం, తదనంతరం చోటుచేసుకోబోతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. టీ.సర్కారు అనుసరిస్తున్న తీరుపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల కేసులో ఈసీ నోటీసు ఇవ్వాలి కానీ ఏసీబీ కాదని బాబు మంత్రులతో అన్నట్టు తెలిసింది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నామని చెప్పారు. అసలు ఏసీబీకి నోటీసులు జారీ చేసే అధికారం లేదని చంద్రబాబు స్పష్టంగా మంత్రులతో చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ నోటీసులు ఇచ్చినా తిరస్కరించాలని సీఎం మంత్రులతో అన్నారు. ఇక తాను సీఎం పదవికి రాజీనామా చేస్తే... పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన అశోక్ గజపతి రాజు సీఎం అవుతారని దుష్ప్రచారం జరుగుతోందని భేటీలో పేర్కొన్నారు.