: కేసీఆర్ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారు: బీజేపీ నేత నాగం
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. పక్క రాష్ట్రాలతో ఆయన గిల్లికజ్జాలు పెట్టుకుంటూ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని అన్నారు. వరంగల్ ఎన్నిక కోసమే పాలమూరు, రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. కానీ 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను వదిలేశారని ధ్వజమెత్తారు. రేపు లేదా ఎల్లుండి తాను దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్నట్టు నాగం తెలిపారు.