: తెలంగాణ సర్కారు కూలిపోయే ఆధారాలు మావద్ద ఉన్నాయి: ఏపీ మంత్రి ప్రత్తిపాటి


తమ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని ఏ మాత్రం ప్రయత్నించినా, తెలంగాణ సర్కారు కూలిపోతుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఏసీబీ నోటీసులకు తాము భయపడేది లేదని, తప్పుడు కేసుల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని అన్నారు. తమ వద్ద కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయేంతటి ఆధారాలున్నాయని ఆయన హెచ్చరించారు. వాట్సాప్ ల ద్వారా ఫాల్స్ మెసేజ్ లు పంపుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న ఇందిరాగాంధీ, రాజశేఖరరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి కేసీఆర్ కు కూడా పడుతుందని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని అన్నారు. ఇక్కడున్న ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు కాబట్టే సొంత పోలీసులను భద్రతగా పెట్టుకోవాల్సి వస్తోందని ప్రత్తిపాటి వివరించారు.

  • Loading...

More Telugu News