: తాజ్ మహల్ పరిసరాల్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం
ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం తాజ్ మహల్ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తాజ్ మహల్ కాంప్లెక్స్ వద్ద వైఫై సౌకర్యాన్ని ప్రారంభించారు. బీఎస్ఎన్ ఎల్ ద్వారా వైఫై హాట్ స్పాట్ తో మొదటి అర్ధగంట పాటు ఉచిత ఇంటర్నెట్ ను పొందవచ్చు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా లక్షకుపైగా జనాభా, పర్యాటక ప్రాంతాల్లో వైఫై సౌకర్యాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు పర్యాటక ప్రాంతాల్లో వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నారు.