: టీమిండియా ముందు కఠినపరీక్ష


భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫార్మాలిటీ ముగిసింది! ఏకైక టెస్టు వరుణుడి కారణంగా డ్రాగా ముగిసింది. ఇక, బంగ్లా జట్టుతో మూడు వన్డేల సిరీస్ కు రంగం సిద్ధమైంది. తొలి వన్డే జూన్ 18న, రెండో వన్డే జూన్ 21న, మూడో వన్డే జూన్ 24న నిర్వహిస్తారు. టెస్టులో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకు వన్డే సిరీస్ లో భిన్నమైన అనుభవం ఎదురవుతుందని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ లో గణనీయంగా మెరుగుపడింది. ముఖ్యంగా, సొంతగడ్డపై బాగా రాణిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ లో అందరినీ ఆకట్టుకునేలా ప్రదర్శన కనబర్చింది కూడా. ఈ నేపథ్యంలో, బంగ్లా యువ జట్టును తక్కువ అంచనా వేస్తే బోల్తాపడడం ఖాయమని టీమిండియా వ్యూహకర్తలకు తెలియంది కాదు. దీంతో, ధోనీ అండ్ కో పదునైన వ్యూహాలతో బరిలో దిగాలని నిశ్చయించుకుంది. పిచ్ పరిస్థితి ఎలా ఉన్నా, జట్టు కూర్పే కీలకం అవుతుందని కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు. బంగ్లా పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయని తెలిసిందే. దీంతో, స్పిన్ బౌలింగ్ వ్యూహాలతో బంగ్లా జట్టును కట్టడి చేయడంపైనే టీమిండియా మేనేజ్ మెంట్ దృష్టి సారించింది.

  • Loading...

More Telugu News