: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు 14 టేపులు... ల్యాబ్ వద్ద భారీ భద్రత
ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన 14 టేపులు హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ల్యాబ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచే ఒక ప్లాటూన్ బలగాలు ల్యాబ్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అనుమతి లేకుండా ఏ ఒక్కరినీ కూడా ఎఫ్ఎస్ఎల్ లోకి అనుమతించడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినవిగా భావిస్తున్న టేపులు కూడా ల్యాబ్ లో ఉండటంతో, టీఎస్ ప్రభుత్వం ల్యాబ్ కు కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది.