: ఈ కెమెరా కంటితో చూస్తే దేన్నైనా పట్టేయొచ్చు... 4 డిటాచబుల్ లెన్స్ తో ఐబాల్ స్మార్ట్ ఫోన్


నాలుగు రకాల డిటాచబుల్ లెన్స్ తో లభించే తొలి స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి అతిత్వరలో అందుబాటులోకి రానుంది. 'ఎంఎస్ఎల్ఆర్ కోబాల్ట్ 4 పేరిట' ఐబాల్ విడుదల చేసిన ఫోన్లో నాలుగు లెన్స్ లు ఇస్తున్నామని, వీటితో 8 రెట్ల వరకూ దూరాన్ని జూమ్ చేయవచ్చని, 175 నుంచి 180 డిగ్రీల వ్యూ యాంగిల్ ను కలిగివుంటాయని సంస్థ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారిత వ్యవస్థపై పనిచేసే ఫోన్లో, 5 అంగుళాల డిస్ ప్లే, 1.4 జిహెచ్ ఆక్టా కోర్ కార్టెక్స్-ఏ7 ప్రాసెసర్, 1జిబి రామ్, 8 జిబి మెమొరీతో లభిస్తుందని, దీని ధర రూ. 8,499 అని తెలిపింది. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన 8 ఎంపీ కెమెరాకు అదనంగా 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా అదనపు ఆకర్షణగా పేర్కొంది. ఈ కెమెరా కంటితో దూరంగా ఉన్న పరిసరాలను మిగతా స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే మరింత స్పష్టంగా చిత్రీకరించవచ్చని, మరికొన్ని రోజుల్లో ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News