: 30 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను లాక్కొని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు కుట్రపన్నారు: గవర్నర్ తో కేసీఆర్


టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని గవర్నర్ నరసింహన్ కు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారిని లాక్కొని, తమ ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారని తెలిపారు. నిన్న గవర్నర్ ను కలసిన సందర్భంగా కేసీఆర్ ఈ విధంగా ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసును విచారిస్తున్న అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ... వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News