: పెరోల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్న సంజయ్ దత్


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి పెరోల్ కోసం జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. సంజయ్ పెరోల్ దరఖాస్తు పెట్టుకున్న విషయాన్ని ఎరవాడ జైలు అధికారులు కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం దరఖాస్తు పరిశీలన జరుగుతోందని చెప్పారు. ఎప్పటిలాగే 30 రోజుల పెరోల్ కోసం డివిజినల్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కారణంగా సుప్రీంకోర్టు సంజయ్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2007 నుంచి 2008 వరకు అప్పటికే 18 నెలల శిక్ష అనుభవించిన సంజూ మిగతా జైలు శిక్షను ప్రస్తుతం పూణేలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News