: ఆ రోజు వచ్చేంత వరకు పుట్టిన రోజు జరుపుకోను: వీహెచ్


తనదైన శైలిలో వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు పుట్టిన రోజు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు వీహెచ్ జన్మదినం. దీంతో, అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు వీహెచ్ జన్మదిన వేడుకలు జరపడానికి సన్నాహకాలు చేయబోయారు. ఈ క్రమంలో, తాను పుట్టిన రోజును జరుపుకోవాలనుకోవడం లేదని వారికి వీహెచ్ స్పష్టం చేశారట. మరో నాలుగేళ్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందో, లేదో ఇప్పుడే అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో, ఈ కాంగ్రెస్ సీనియర్ నేత తన పుట్టిన రోజును ఎప్పుడు జరుపుకుంటారో వేచి చూడాలి మరి.

  • Loading...

More Telugu News