: కిం కర్తవ్యం... మంత్రులు, అధికారులతో మరోసారి బాబు చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం అధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండడంతో, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో ఆయన చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు యనమల, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, డీజీపీ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఏపీలో వివిధ పోలీసు స్టేషన్లలో కేసీఆర్ పై నమోదైన కేసుల గురించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఫోన్ల ట్యాపింగ్ అంశంపైనా చర్చ జరుగుతోంది. వీటి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.