: రేపటి నుంచి మంచిది కాదు... శుభకార్యాలకు, బాజా భజంత్రీలకు బ్రేక్!


పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, కొత్త పనులు ఇత్యాది శుభకార్యాలు ఏవి ప్రారంభించాలన్నా మరో నాలుగు నెలల పాటు ఆగక తప్పదు. ఒకవైపు గోదావరి పుష్కరాలు, శూన్య మాసాలు, మరోవైపు అధిక ఆషాఢం, ఆపై మూఢమి... ఇలా, గ్రహగమనాలు, పంచాంగాలు అనుసరించి అంతా అననుకూల కాలమే. బుధవారం నుంచి ఎటువంటి శుభకార్యాలకూ మంచి ముహూర్తాలు లేవు. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది. తిరిగి జూలై 17 నుంచి అధిక ఆషాఢం, ఆపై భాద్రపదం, శూన్య మాసం, శుక్ర మూఢమి వరుసగా వచ్చాయి. పైగా పుష్కర సమయం కూడా కావడంతో, పెద్దలకు తర్పణాలు మినహా మరే శుభకార్యాలకూ వీలులేకుండా పోయింది. సెప్టెంబర్ వరకూ ఇదే పరిస్థితి. అక్టోబరు 13 తరువాత వచ్చే ఆశ్వయుజ మాసం తరువాతనే తిరిగి శుభకార్యాలకు ముహూర్తాలు దొరకుతాయి.

  • Loading...

More Telugu News