: వాళ్లు బాహుబలికి పనికిరారా?: ట్వీట్ సంధించిన సీనియర్ నటుడు సురేశ్


టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళికి సీనియర్ నటుడు సురేశ్ ఓ ట్వీట్ సంధించారు. 'బాహుబలి' చిత్రాన్ని సపోర్ట్ చేయనని స్పష్టం చేశారు. "జగపతి బాబు, సుమన్, సాయికుమార్ వంటి సీనియర్ నటులు 'బాహుబలి' చిత్రంలో పాత్రలు పోషించేందుకు సరిపోతారని రాజమౌళి ఆలోచించలేదు" అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజమౌళి వాళ్లను పరిగణనలోకి తీసుకోలేదని, అందుకే తాను 'బాహుబలి' చిత్రాన్ని సపోర్ట్ చేయనని ట్వీట్ చేశారు. కాగా, రాజమౌళిపై ఇంతకుముందెవరూ ఇలా స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో, ఈ వెటరన్ నటుడి ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. క్యారెక్టర్ నటులుగా తమిళ చిత్రసీమకు చెందిన సత్యరాజ్, నాజర్ లను తీసుకోవడంపైనే సురేశ్ ట్వీట్ సంధించినట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలో బిజ్జలదేవ పాత్రను నాజర్, కట్టప్ప పాత్రను సత్యరాజ్ పోషించారు.

  • Loading...

More Telugu News