: ఈ పాత్ర నా కలల పాత్ర: శ్రద్ధా కపూర్
'ఏబీసీడీ-2' సినిమాలో తాను పోషించిన పాత్ర కలల పాత్ర అని బాలీవుడ్ వర్ధమాన నటి శ్రద్ధా కపూర్ తెలిపింది. 'ఏబీసీడీ-2' ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, ఈ పాత్ర పోషించడం వెనుక తన తండ్రి స్పూర్తి ఉందని చెప్పింది. ఈ సినిమాలో పోషించిన డ్యాన్సర్ పాత్ర కోసం ఎంతో ఎదురు చూశానని శ్రద్ధా వెల్లడించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తన కలల పాత్ర అని చెప్పింది. ఇన్నాళ్ల కల సాకారమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని శ్రద్ధా తెలిపింది. ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేసేందుకు తన తండ్రి ఎంతో ప్రోత్సాహం అందించారని శ్రద్ధా చెప్పింది. శ్రద్ధా కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు (విలన్) శక్తి కపూర్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ ధావన్ ఆమెకు జోడీగా నటించగా, ఈ సినిమాకు ప్రముఖ నృత్య దర్శకుడు రెమో డిసౌజా దర్శకత్వం వహించడం, కీలకపాత్రలో ప్రభుదేవా నటించడం విశేషం.