: పైలట్ చాకచక్యంతో ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో రన్ వే పై ఎయిర్ ఇండియా విమానం టైర్ పేలింది. దీంతో అదుపుతప్పిన విమానాన్ని పైలట్ చాకచక్యంగా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదని అధికారులు ప్రకటించారు.