: ఎన్టీవీ ప్రసారాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారు: శ్రీధర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఎన్టీవీ చానల్ ప్రసారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు వ్యవహారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎప్పుడూ మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడే చంద్రబాబు... ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం మంచిది కాదని అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.