: యశోదా ఆసుపత్రిలో ఈటెలను పరామర్శించిన కేసీఆర్


హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఈటెల రాజేందర్ ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి పీఏ ముకుందరెడ్డిని కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. మంత్రి ఈటెల ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల విశ్రాంతి అవసరమని ఇప్పటికే వైద్యులు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఈటెల, ఆయన పీఏ, గన్ మెన్ లకు గాయాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News