: అఖిలేశ్ సర్కారుపై బీజేపీ ధ్వజం


ఉత్తరప్రదేశ్ లో మీడియా ప్రతినిధులపై అరాచకాలను బీజేపీ ఖండించింది. వారం రోజుల వ్యవధిలో రెండు ఘటనలు చోటు చేసుకోవడంపై కాషాయదళం తీవ్రంగా స్పందించింది. యూపీలో వాస్తవ పరిస్థితులను ఎత్తిచూపితే పరిణామాలు ఇలాగే ఉంటాయంటూ దాడుల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారని దుయ్యబట్టింది. అధికార సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా రాస్తే ఏం జరుగుతుందో తెలిపేందుకే కొన్ని శక్తులు దాడులకు తెగబడుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News