: రేవంత్ రిమాండ్ 29వ తేదీ వరకు పొడిగింపు


ఓటుకు నోటు వ్యవహారంలో రిమాండ్ లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. కాసేపటి క్రితం రేవంత్ తో పాటు, సెబాస్టియన్, ఉదయ్ సింహలను ఏసీబీ అధికారులు చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని... ఇంకా సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి ఇంకా నివేదిక అందలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, రేవంత్ తో పాటు మిగిలిన వారి రిమాండ్ ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News