: నెస్లే కొత్త వాదన... ఆ మ్యాగీ ప్యాకెట్లు నకిలీవి
మ్యాగీ వివాదంలో నెస్లే సరికొత్త వాదనకు తెరలేపింది. గడచిన జనవరిలో యూఎస్ ఫుడ్ రెగ్యులేటర్ దిగుమతికి అనుమతించని మ్యాగీ ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయినవి కాదని, అని నకిలీ ప్యాకెట్లనీ నెస్లే ప్రతినిధి ఒకరు వివరించారు. "యూఎస్ ఎఫ్ డీఏ వెబ్ సైట్ నుంచి మేము సమాచారాన్ని సేకరించాం. అవి ఇండియాలో మాచేత తయారైన ఉత్పత్తులు కావు. కానీ వాటిపై మా సంస్థకు సంబంధించిన లేబుల్స్ వున్నాయ. దీన్ని బట్టి అవి నకిలీలని స్పష్టంగా తెలుస్తోంది" అని అన్నారు. యూఎస్ఏకు ఎగుమతి అయిన కొన్ని ప్రోడక్టులు హోల్ సేలర్స్ నుంచి డైరెక్ట్ గా వెళ్లి వుండవచ్చని, దేశవాళీ మార్కెట్ కోసం ఉద్దేశించిన ఉత్పత్తులు ఎగుమతి చేయరాదని కూడా ఆయన అనడం గమనార్హం. ఇండియాలో మ్యాగీపై నిషేధం విధించిన తరువాత యూఎస్ ఎఫ్ డీఏ సైతం ఆ ప్యాకెట్లను మరోసారి పరీక్షల నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే.