: తత్కాల్ టికెట్ల బుకింగ్ కు మారిన సమయం
అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారి కోసం భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయాలు మారాయి. కొత్త సమయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తత్కాల్ రిజర్వేషన్ల బుకింగును రెండు కేటగిరీలుగా విభజించారు. ఉదయం 8 గంటల నుంచి సాధారణ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయి. ఆపై 10 గంటల నుంచి 'తత్కాల్' ఏసీ టికెట్ల బుకింగ్, 11 గంటల నుంచి స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్ మొదలవుతుందని అధికారులు తెలిపారు.