: డ్రా ఫలితం... దిగజారిన టీమిండియా ర్యాంకు
బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ డ్రా కావడంతో ర్యాంకింగ్స్ లో టీమిండియా దిగజారింది. ఫతుల్లా వేదికగా జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఆటగాళ్లు ప్రతిభ చూపినప్పటికీ వర్షం కారణంగా ఫలితం తేలలేదు. దీంతో రెండు పాయింట్లు నష్టపోయిన టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. రెండో ర్యాంకు నుంచి దిగజారిన టీమిండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్ తో కలిసి నాలుగో స్థానం పంచుకుంటోంది. ఈ మూడు దేశాలకు 97 పాయింట్లు ఉండడం విశేషం. తొలి మూడు స్థానాల్లో వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఉండగా, నాలుగో స్థానంలో భారత్, పాక్, ఇంగ్లండ్ ఉన్నాయి. ఏకైక టెస్టు ద్వారా రెండు పాయింట్లు సాధించిన బంగ్లాదేశ్ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది.