: 15 రోజుల్లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా సిద్ధం
15 రోజుల్లోగా నేపాల్ కొత్త రాజ్యాంగ ముసాయిదా పూర్తి కానుందని నేపాల్ నూతన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. తాజాగా సమావేశమైన రాజ్యాంగ సభ 15 రోజుల్లోగా నూతన రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేసి సమర్పించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. నేపాల్ లోని రాజకీయ పార్టీలన్నీ ఒక ఒప్పందానికి రావడంతో, ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న నేపాల్ రాజ్యాంగ తయారీ ప్రక్రియ ఊపందుకుంది.