: బాబుతో గవర్నర్ సలహాదారుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ఆరోపణలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ తొలిసారి స్పందించారు. వివాదాల వివరాలు ఆరాతీసేందుకు సీఎం చంద్రబాబునాయుడు వద్దకు సలహాదారులను పంపించారు. దీంతో గవర్నర్ సలహాదారులు ఏపీబీఎన్ శర్మ, ఏకే మహంతి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. సమావేశంలో ఉమ్మడి రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న పదజాలం, విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిలో భద్రతాంశాల పర్యవేక్షణ బాధ్యతలు గవర్నర్ వేనని సూచించే సెక్షన్ 8 గురించి చర్చ జరిగినట్టు సమాచారం.