: మరో బిగ్ డీల్...వేదాంత గ్రూప్ లో కెయిర్న్ ఇండియా విలీనం


భారత వ్యాపార రంగంలో మరో బిగ్ డీల్ కు నాంది పడింది. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియా 'వేదాంత లిమిటెడ్'లో విలీనం కానుంది. నేడు సమావేశమైన రెండు సంస్థల బోర్డు డైరెక్టర్లు విలీనానికి ఆమోదముద్ర వేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఈ డీల్ పూర్తి కావొచ్చని వారు భావిస్తున్నారు. అయితే, విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుందని సమాచారం. విలీనం అనంతరం కెయిర్న్‌ ఇండియా షేర్‌ హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా ఆలోచించిన వేదాంత లిమిటెడ్, కెయిర్న్ ఇండియా గ్రూప్‌ లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ కు సంబంధించిన 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అంతే కాకుండా వివిధ మార్గాల ద్వారా 2011లో వేదాంత లిమిటెడ్ 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగిసే సరికి కెయిర్న్ ఇండియాలో వేదాంత లిమిటెడ్ కు 59.9 శాతం వాటాలు ఉన్నాయి. దీంతో వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం కానుంది.

  • Loading...

More Telugu News