: ఆ టేపులు నిజమైతే, చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే: డిగ్గీ రాజా


ఓటుకు నోటు కేసులో వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు నిజమని తేలితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఓ సారి స్పందించిన డిగ్గీ రాజా నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మరోమారు దీనిపై మాట్లాడారు. తనను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబును ప్రధాని మోదీ వెనకేసుకొస్తారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందించిన డిగ్గీ రాజా... గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ 2002లో ఆ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల నిందితులను కాపాడిన మాట నిజమైతే, నకిలీ ఎన్ కౌంటర్ల నిందితులను రక్షిస్తున్న మాట నిజమైతే, చంద్రబాబును కూడా మోదీ రక్షిస్తారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News