: కృష్ణాయాదవ్ సరసన చంద్రబాబూ చేరతారు!: తలసాని సంచలన వ్యాఖ్య
స్టాంపుల కుంభకోణంలో మాజీ మంత్రి కృష్ణాయాదవ్ మూడేళ్లు జైలుకెళ్లివచ్చారని, త్వరలో చంద్రబాబు కూడా ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లి కృష్ణాయాదవ్ సరసన చోటు దక్కించుకోనున్నారని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు గతి ఏమవుతుందో రేపో మాపో చూస్తారు. ఓటుకు నోటు కేసు విచారణలో దర్యాప్తు సంస్థలు మరింత వేగం పెంచాయి. తప్పు చేసే వారు ఎంతటివారైనా ఎవరికీ మినహాయింపులు ఉండవు. దేశ ద్రోహం కేసులో కృష్ణాయాదవ్ మూడేళ్ల పాటు జైలుకెళ్లి వచ్చారు. ఆయన సరసన చంద్రబాబూ చేరతారు’’ అని తలసాని వ్యాఖ్యానించారు.