: చిన్న సినిమాగానే మొదలుపెట్టాం... మీడియానే పెద్దది చేసింది: రాజమౌళి


తిరుపతిలో 'బాహుబలి' ఆడియో వేడుక మొదలైంది. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటీనటులు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళిని మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి ఆయన బదులిస్తూ... తొలుత బాహుబలి చిన్న సినిమానే అని, అయితే, మీడియానే పెద్దది చేసిందని అన్నారు. మీడియా ప్రచారం కారణంగా బాహుబలి చిత్రంపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొందని తెలిపారు. ఇక, తాను చిన్నప్పటి నుండి రాజులు, రాజ్యాలు, కోటలు... ఇలాంటి ఊహాలోకంలో సంచరించేవాడినని చెప్పుకొచ్చారు. సక్సెస్ ఫార్ములా ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు చిరునవ్వుతో బదులిచ్చారు. తనకేం తెలీదని, అది కేవలం అదృష్టమేనని తెలిపారు. అందరూ మంచి సినిమాలు రూపొందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తారని, అయితే, ప్రేక్షకులే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తారని జక్కన్న అభిప్రాయపడ్డారు. ఏ సినిమాను వారు ఆదరిస్తారో... ఏ సినిమాను ఆదరించరో ఎవరికీ తెలియదని, అంతా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News