: ఏపీ మంత్రులకు గవర్నర్ అపాయింటుమెంట్
ఆంధ్రప్రదేశ్ మంత్రులు నేటి సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలిసి పలు విషయాలపై చర్చించనున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్ బాబు సహా పలువురు మంత్రులు గవర్నర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు అపాయింటుమెంట్ ఖరారైనట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అంశాలపై గవర్నరుకు ఏపీ మంత్రులు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. విభజన చట్టంలోని 8వ సెక్షన్ అమలు చేయాలని, శాంతిభద్రతల వ్యవహారాలను గవర్నర్ స్వయంగా పర్యవేక్షించాలని వారు కోరనున్నారు. కేసీఆర్ స్వయంగా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులపై ఉపయోగిస్తున్న పరుష పదజాలంపైనా వారు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.