: తిరుపతిలో 'బాహుబలి' కోలాహలం
తిరుపతిలో 'బాహుబలి' కోలాహలం మొదలైంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వేదికైన ఎస్వీ యూనివర్శిటీ మైదానం సుందరంగా ముస్తాబైంది. వర్శిటీ గ్రౌండ్ కు మధ్యాహ్నం నుంచే అభిమానుల రాక మొదలైంది. స్థానిక అతిథులు కూడా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న టీవీ 5 చానల్ కాస్త ముందుగానే తన యాంకర్లను రంగంలోకి దింపింది. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ప్రముఖుల సంబంధీకుల అభిప్రాయాలు తెలుసుకుంటూ యాంకర్లు తమదైన శైలిలో సందడి చేస్తున్నారు.