: చంద్రబాబూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి!: జేపీ
ఏపీ సీఎం చంద్రబాబుపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రశ్నాస్త్రాలు సంధించారు. వాటికి బదులివ్వాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో తన ప్రశ్నలను పోస్టు చేశారు. మీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఓటును కొనేందుకు రూ.5 కోట్లు ఆఫర్ చేసింది నిజమేనా?, ఒకవేళ మీ ఎమ్మెల్యే ఆఫర్ చేసింది నిజమే అయితే, అందుకు మీ సూచనలే కారణమా?, మీ ఆదేశాలు లేకుండా మీ ఎమ్మెల్యే సొంతగానే ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి ఉంటే, అతనిపై మీరు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఆడియో టేపుల్లో గొంతు మీదే అయితే పదవికి రాజీనామా చేసేందుకు మీరు సిద్ధమా?... అని జేపీ ప్రశ్నించారు.