: మళ్లీ అడ్డుకున్న వరుణుడు... డ్రా దిశగా టెస్టు!
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ ని మరోసారి వరుణుడు అడ్డుకున్నాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ 111 పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. ఆ సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్లను కోల్పోయింది. మరొక్క రోజు మాత్రమే ఆట మిగిలి వున్న ఈ తరుణంలో మ్యాచ్ డ్రా అయ్యేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే అద్భుతం జరగాలి. బంగ్లాదేశ్ 262 పరుగుల్లోపు ఆలౌట్ అయి, ఫాలో ఆన్ ఆడి మళ్లీ ఆలౌట్ కావాలి. అంటే ఒక్క రోజులో 17 వికెట్లను భారత బౌలర్లు కూల్చగలగాలి. ఇది జరగడం దాదాపు అసాధ్యమని, అందువల్ల మ్యాచ్ డ్రా అయినట్టేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.