: ఇన్వెస్టర్లకు గడ్డుకాలం... ఎమినిది నెలల్లో ఎన్నడూ లేనంత పతనం!


స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో చూడని గడ్డుకాలానికి ఎదురీదాల్సిన పరిస్థితి. మార్కెట్ల పతనం వరుసగా మూడవ వారంలోనూ కొనసాగడం, సూచికలు ఎనిమిది నెలల కనిష్ఠానికి చేరడంతో, ఈ పతనం ఎంతవరకూ వెళుతుందన్న విషయంలో స్పష్టమైన సంకేతాలు రావడం లేదని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. అత్యంత కీలకమైన 8 వేల పాయింట్ల స్థాయి వద్ద మద్దతు సాధించడంలో నిఫ్టీ విఫలం కావడంతో పెట్టుబడిదారుల ఆందోళన మరింతగా పెరిగింది. కాగా, జూన్ 12తో ముగిసిన వారాంతానికి సెన్సెక్స్ 343 పాయింట్లు పడిపోయి 1.3 శాతం నష్టంతో 26,425 పాయింట్లకు, నిఫ్టీ 1.6 శాతం పతనంతో 7,983 పాయింట్లకు దిగజారాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం మార్కెట్లలో రిస్క్ అధికంగా కనిపిస్తోందని, అమెరికాలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు, రుతుపవనాలపై ఉన్న అనిశ్చితి సెంటిమెంటును ప్రభావితం చేస్తున్నాయని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News