: చంద్రబాబుపై మళ్లీ విరుచుకుపడ్డ తలసాని
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు మోసకారి అని ఆరోపించారు. ముడుపుల వ్యవహారంలో చిక్కుకున్న బాబు ఏపీ ప్రజలను అడ్డంపెట్టుకుని బయటపడాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గ నైజాన్ని ఏపీ ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. హైదరాబాదు నగరంలో శాంతిభద్రతలకు ప్రమాదం వాటిల్లిందంటూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడాన్ని తలసాని తప్పుబట్టారు. ఏడాది కాలంగా నగరంలో సీమాంధ్రులు హాయిగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.