: సోషల్ మీడియాలో చిన్నారి అత్తాకోడళ్ల హల్ చల్... రెండు రోజుల్లో 2 లక్షల హిట్స్!
తొమ్మిదేళ్ల రమ్మశ్రీ అప్పుడే అత్త అవతారమెత్తింది. ఇక ఐదేళ్ల చిన్నారి బుడత యోధ కోడలైపోయింది. రిలయ్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో అసలే కాదు. మరి ఇంకెక్కడ అనుకుంటున్నారా? మనమంతా నిత్యం గంటల తరబడి చక్కర్లు కొడుతున్న సోషల్ మీడియాలో. అత్తాకోడళ్లుగా రమ్యశ్రీ, యోధలు చక్కటి హవభావాలు పలికిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం రెండంటే రెండు రోజుల్లో సదరు వీడియోకు రెండు లక్షల హిట్స్ వచ్చాయి. కాస్త బొద్దుగా ఉన్న రమ్యశ్రీ అత్త పాత్రలో చక్కగా ఇమిడిపోగా, చిన్నగా కాస్తంత బక్కపలుచగా ఉన్న యోధ కూడా కోడలి పాత్రకు ఇట్టే సరిపోయింది. వీరిద్దరి మధ్య అత్తాకోడళ్ల సంభాషణలు రియల్ లైఫ్ గాథల కంటే ఆసక్తిగా ఉన్నాయి. అందుకేనేమో బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వయంగా ఫోన్ చేసి మరీ ఈ తెలుగమ్మాయిలను ప్రశంసల్లో ముంచెత్తారు.