: బతికుండగానే తండ్రిని శ్మశానంలో వదిలేసిన కొడుకు... పాలకొల్లులో దారుణం
జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తండ్రే ఆ కొడుకుకు భారమయ్యాడు. వయసులో ఉండగా కొడుకుల ఉన్నతి కోసం శక్తిమేర కష్టపడి, ప్రస్తుతం ఏడు పదుల వయసులో కదలలేని స్థితిలో ఉన్న ఆ తండ్రిని వదిలించుకునేందుకు సిద్ధపడ్డ సదరు కొడుకు... బతికున్న తండ్రిని శ్మశానంలో వదిలేశాడు. పైగా 'ఆయన చస్తే పూడ్చిపెట్టండి' అంటూ అక్కడి కాటికాపరులకు చెప్పేసి మరీ వచ్చాడట. మూడు రోజులుగా శ్మశానంలో పడి ఉన్న ఆ తండ్రి తిండి తిప్పలు లేక నానా అవస్థలు పడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం ఈ దారుణం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వెలుగు చూసింది.