: మాస్తిఫ్ జాతి కుక్కతో ఇంటిలో సిరిసంపదల పంటేనట.. ఖరీదు మాత్రం రూ.9 కోట్లట!


టిబెట్ లో కనిపించే మాస్తిఫ్ జాతి కుక్కలంటే చైనీయులకు మక్కువ ఎక్కువే. ఎందుకంటే ఎక్కువ బొచ్చుతో ఎత్తుగా ఉండే ఈ కుక్కలు కాపలా ఉండే ఇంటిలోకి అడుగుపెట్టాలంటే అపరిచితులకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అంతేకాదండోయ్, ఈ కుక్కులుండే ఇంటిలో సిరిసంపదలు అంతకంతకూ పెరుగుతాయట. అందుకేనేమో ఈ కుక్కలను పెంచుకోవడానికి చైనీయులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఈ కుక్కల ఖరీదు చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మక మానవు. ఓక్కో మాస్తిఫ్ జాతి కుక్క ఖరీదు ప్రస్తుతం రూ.9 కోట్లు పలుకుతోందట. అయినా వీటికోసం చైనీయులు ఎగబడుతున్నారట. పర్వత ప్రాంతాల్లోనే కాక సాధారణ మైదాన ప్రాంతాల్లోనూ నిక్షేపంలా జీవించే ఈ కుక్కలు చైనా సంపన్నుల ఇళ్లలో కనీసం 20కి తక్కువ కాకుండా ఉంటున్నాయట. ఈ జాతి కుక్కల్లో చిన్న కుక్క ఖరీదే రూ.6 లక్షలకు పైగానే ఉందట. ఇక రికార్డు ధర విషయానికొస్తే... ఇటీవల చైనాకు చెందిన బొగ్గు గనుల ఆసామి యాంగ్ ఈ జాతికి చెందిన ఓ శునక రాజాన్ని అక్షరాలా రూ.9.40 కోట్లు పెట్టి ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేశారట.

  • Loading...

More Telugu News