: ఏసీబీ డీజీతో చంద్రబాబు భేటీ... ఓటుకు నోటుపై సాగుతున్న చర్చ


ఓటుకు నోటు కేసులో ప్రత్యక్ష పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం తన రాష్ట్రానికి చెందిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ మాలకొండయ్యతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మొదలైన ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు పూర్వాపరాలు, తాజా పరిణామాలు, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చూపుతున్న సాక్ష్యాలు, ఆ శాఖ భవిష్యత్ వ్యూహాలపై మాలకొండయ్యతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News