: ధవళేశ్వరం దుర్ఘటన దురదృష్టకరం... ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, చికిత్స పొందుతూ మరో బాలిక చనిపోయింది. పదమూడేళ్ల బాలుడు కిరణ్ ఒక్కడే బతికాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ధవళేశ్వరం దుర్ఘటన దురదృష్టకరం, బాధాకరం’’ అంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపాన్ని ప్రకటించారు.