: ఇండియాలో బంగారానికి డిమాండ్ తగ్గింది... ధర కూడా దిగొస్తుంది!
ఇండియాలో బంగారానికి డిమాండ్ తగ్గింది. అవును నిజమే, గడచిన నాలుగు త్రైమాసికాల్లో 200 టన్నులకు పైగా బంగారం దిగుమతి కాగా, మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి 178 టన్నుల బంగారం దిగుమతి నమోదైంది. గడచిన మేలో కేవలం 60 టన్నుల బంగారమే ఇండియాలోకి వచ్చింది. ఇక మరో నాలుగైదు నెలలు వివాహాది శుభకార్యాలు లేకపోవడంతో జూన్, జులై మాసాల్లో దిగుమతులు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ధరలు కూడా మరింతగా తగ్గుతాయని అంచనా. కాగా, నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 26,894 రూపాయల వద్ద కొనసాగుతోంది.