: చైనా హ్యాకర్ల చేతిలో అమెరికా సైన్యం సమాచారం!


అమెరికా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చిక్కింది. ఈ విషయంపై 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చైనా నుంచి రెండు సార్లు సైబర్ దాడి జరిగిందని, పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయంలోని డేటా బేస్ నుంచి ఉద్యోగుల రికార్డులు, వారి సెక్యూరిటీ క్లియరెన్స్ తదితర వివరాలు చోరీకి గురయ్యాయని తెలిపింది. హ్యాకర్ల చేతికందిన సమాచారం అత్యంత రహస్యంగా ఉండాల్సినదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. కాగా, వీటిల్లో కొందరు సీఐఏ అధికారుల సమాచారం కూడా ఉందని తెలుస్తోంది. చైనా హ్యాకర్లు సీఐఏ అధికారుల వివరాలు బట్టబయలు చేసే ప్రమాదముందని మరో అధికారి వ్యాఖ్యానించారు. హ్యాకర్ల చేతికందిన డేటా బేస్ లో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, పెట్టుబడి రికార్డులు, స్నేహితులు, బంధువు వివరాలు, విదేశాల్లో వారికున్న కాంటాక్టుల వివరాలన్నీ ఉన్నాయని 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది.

  • Loading...

More Telugu News