: లూథియానాలో ఘోరం... విషవాయువు లీకై ఆరుగురి మృతి
పంజాబ్ లో అమోనియా విషవాయువుతో వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ లీకై పెను ప్రమాదం జరిగింది. విషవాయువులు పీల్చి ఆరుగురు మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ట్యాంకర్ లూథియానాకు 25 కిలోమీటర్ల దూరంలోని ఫ్లయ్ ఓవర్ కింద చిక్కుకున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉండి, గాలి పీల్చిన వారు మరణించారని దొరాహ పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ఓ తెలిపారు. శ్వాస తీసుకోవడంలో పలువురికి ఇబ్బందులు తలెత్తాయని, వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.