: రాత్రి 10 గంటలకు ప్రమాదం జరిగితే తెల్లవారుజామున అంబులెన్స్ వచ్చింది: ‘ధవళేశ్వరం’ మృత్యుంజయుడు
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ప్రమాదంలో తక్షణ సహాయం అందని కారణంగానే ఓ బాలుడు మినహా మిగిలిన వారంతా మృత్యువాతపడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగితే, నేటి తెల్లవారుజామున కాని అక్కడికి అంబులెన్స్ చేరుకోలేదు. బ్యారేజీ పై నుంచి గోదావరిలోకి బోల్తా పడ్డ వ్యాన్ ను రాత్రి ఎవరూ గుర్తించలేదు. తెల్లవారుజామున వాహనాన్ని గుర్తించిన స్థానికులు 108 కు సమాచారం అందించారు. ఈ మేరకు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ 13 ఏళ్ల బాలుడు ఈ విషయాలను చెప్పాడు. ప్రస్తుతం అతడు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.