: ధవళేశ్వరం దుర్ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి...మృతులకు సంతాపం తెలిపిన వైఎస్ జగన్
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే ఆయన స్థానిక అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిన చంద్రబాబు ఆవేదనకు లోనయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ బాలుడికి మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు.