: కరీంనగర్ ఎస్పీ ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్... మంటలార్పేసిన ఫైర్ సిబ్బంది


కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అధికారిక నివాసంలో నిన్న స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సిలిండర్ నుంచి లీకైన గ్యాస్ కారణంగా ఎస్పీ ఇంటిలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఇంటిలోని నౌకర్లు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదమే తప్పింది.

  • Loading...

More Telugu News