: కోహ్లీ అభిరుచి, భావోద్వేగాల్లో మార్పురావాలి: బాయ్ కాట్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిరుచిలో మార్పు రావాలని ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్ కాట్ సూచించారు. లండన్ లో ఆయన మాట్లాడుతూ, ప్రతిభావంతమైన కెప్టెన్ గా కోహ్లీ ఎదగాలనుకుంటే భావోద్వేగాలను నియంత్రించుకోవాలని అన్నారు. ఉత్తమమైన కెప్టెన్ అంటే కేవలం మైదానంలో పరుగులు సాధించడం మాత్రమే కాదని, భావోద్వేగాలను మైదానంలో కనపడనీయకుండా ఉంచడం కూడానని ఆయన పేర్కొన్నారు. ధోనీలా భావోద్వేగాలు నియంత్రించుకుంటే కోహ్లీని ఉత్తమ కెప్టెన్ గా చూడవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News