: 'సేవ్ ద చిల్డ్రన్' కార్యాలయానికి తాళం వేసిన పాకిస్థాన్


పాకిస్థాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'సేవ్ ద చిల్డ్రన్' స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని మూసివేశారు. ఆ సంస్థ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. పాక్ లో సంస్థ ప్రధాన కార్యాలయం ఇస్లామాబాదులో ఉంది. ఈ కార్యాలయానికి అధికారులు గురువారం నాడు తాళం వేశారు. ఉద్యోగులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు 15 రోజుల్లోగా పాకిస్థాన్ ను వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. దీనిపై దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నిసార్ అలీ ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేసే ఏ సంస్థను అనుమతించబోమని తేల్చి చెప్పారు. సేవ్ ద చిల్డ్రన్ పని తీరు దేశానికి వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఆ ఎన్జీవోపై నిషేధం విధించాలని తాము భావించడం లేదని, వారి పరిధిలో మాత్రమే పనిచేయాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో చాలా ఎన్జీవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా ఇంటలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News